22-05-2025 05:10:15 PM
బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో హనుమాన్ జయంతి(Hanuman Jayanti) వేడుకలు ఘనంగా జరిగాయి. హనుమాన్ జయంతి సందర్భంగా కన్నాల మెయిన్ హైవే పంచముఖ శివాంజనేయ విగ్రహం వద్ద ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక పూజలకు ఏర్పాట్లు చేశారు. భక్తులు పెద్దసంఖ్యలో హాజరై పూజలు చేశారు. కమిటీ అధ్యక్షులు సాంభాశివ రావు, కమిటీ సభ్యులు విగ్రహం వద్ద అన్నదానం చేశారు. టీపీసీసీ రాష్ట్ర ప్రచార కమిటీ కన్వీనర్ నాతరి స్వామి(TPCC State Campaign Committee Convener Nathari Swamy), డీసీసీఓబీసీ కో చైర్మెన్ బండి లక్ష్మణ్, యూత్ కాంగ్రెస్ నాయకులు ఆసం అఖిల్ ప్రత్యేక పూజల అనంతరం భక్తులకు భోజనాలు వడ్డించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మాజీ కౌన్సిలర్ చింతపండు శ్రీనివాస్, బొడ్డు నీలవర్మమూర్తి, సమ్మిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.