22-05-2025 05:19:50 PM
పదోన్నతులు జీవన శైలిని మార్చే విధంగా ఉత్సాహాన్ని కలిగిస్తాయి..
నిజాయితీగా ప్రజలకు సేవలు అందించాలి..
జిల్లా ఎస్పీ యం.రాజేష్ చంద్ర..
కామారెడ్డి (విజయక్రాంతి): ఉద్యోగులకు పదోన్నతులు మరింత బాధ్యతను పెంచుతాయని జిల్లా ఎస్పీ యం.రాజేష్ చంద్ర(District SP M. Rajesh Chandra) తెలిపారు. గురువారం కామారెడ్డి ఎస్పీ కార్యాలయంలో ఏఎస్సై నుండి ఎస్సైలుగా పదోన్నతి పొందిన (11) పోలీసులను జిల్లా ఎస్పీ అభినందించి పదోన్నతి చిహ్నాన్ని ఎస్పీ అలంకరించారు. పోలీసు వ్యవస్థలో నిరంతరంగా సేవలందించి గురువారం పదోన్నతి పొందుతున్న కామారెడ్డి జిల్లా రామారెడ్డి పోలీస్టేషన్(Ramareddy Police Station) ఏఎస్సై యన్ లచ్చీరామ్, ఎల్లారెడ్డి పోలీస్టేషన్ ఏఎస్సై, ఎండి, సిద్దికె, భిక్నూర్ పోలీస్టేషన్ ఏఎస్సై, ఏ. మల్లారెడ్డి, పెద్దకొడపగల్ పోలీస్టేషన్ ఏఎస్సై, రాములు, మాచారెడ్డి పోలీస్టేషన్ ఏఎస్సై, బి. నార్సింలు, గాంధారి పోలీస్టేషన్ ఏఎస్సై, పి. గణేష్, పిట్లం పోలీస్టేషన్ ఏఎస్సై, యల్. లింబద్రి, నాగిరెడ్డిపేట్ పోలీస్టేషన్ ఏఎస్సై, ఉమేష్, దోమకొండ పోలీస్టేషన్ ఏఎస్సై, సుబ్రమణ్య చారి, తాడ్వాయి పోలీస్టేషన్ ఏఎస్సై, సంజీవ్, హన్మగౌడ్ (ఇంటలిజెన్స్ లో ప్రస్తుతం) లు ఎస్సైలుగా, పదోన్నతి పొందారు.
పదోన్నతులు పొందిన పోలీస్ అధికారులు జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్రుడు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందజేశారు. పదోన్నతి పొందిన పోలీసులకు ఎస్పీ పదోన్నతి చిహ్నాలను అలంకరించి శుభాకాంక్షలు తెలియజేసి అభినందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పోలీసుశాఖలో పదోన్నత్తులు మరింత బాధ్యతను పెంచుతాయని అన్నారు, పదోన్నతులు పొందిన పోలీస్ సిబ్బంది రెట్టింపు ఉత్సాహంతో ప్రజలకు సేవలు అందించాలని కోరారు.పోలీసు శాఖలో క్రమశిక్షణతో బాధ్యతగా విధుల పట్ల నిబద్ధతతో వ్యవహరించే ప్రతి ఒక్కరికీ తగిన గుర్తింపు, గౌరవ మర్యాదలు లభిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీలు మదన్ లాల్ల్, యాకుబ్ రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ తిరుపతయ్య, రిజర్వు ఇన్స్ పెక్టర్లు సంతోష్ కుమార్,సిబ్బంది పాల్గొన్నారు.