22-05-2025 05:03:37 PM
తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (H-143) రాష్ట్ర కౌన్సిల్ మెంబెర్ గుర్రం రాజేష్ పిలుపు..
ఇల్లెందు (విజయక్రాంతి): తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం ఆవిర్భవించి మే 31వ తేదీతో 25వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా హైదరాబాద్ జలవిహార్ లో నిర్వహిస్తున్న సంబరాలను విజయవంతం చేద్దామని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్(Telangana Union of Working Journalists) (H-143) రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు గుర్రం రాజేష్ కోరారు. గురువారం ఇల్లందు ప్రెస్ క్లబ్ లో పోస్టర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా అధ్యక్షులు కల్లోజీ శ్రీనివాస్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధనలో తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం నిర్వహించిన చారిత్రాత్మక పాత్రను తెలియజేయడం కోసం మే 31న టీజేఎఫ్ రజతోత్సవాలను నిర్వహిస్తుందని తెలిపారు.
2001 మే 31న ఆవిర్భవించిన తెలంగాణ జర్నలిస్టుల ఫోరం తెలంగాణ రాష్ట్రం సాధించేంత వరకు, 2014 దాకా ఎన్నో సందర్భాల్లో క్రియాశీలక పాత్ర పోషించిందని తెలిపారు. ఇంతటి చారిత్రక నేపథ్యం కలిగిన జర్నలిస్ట్ ఫోరం రజతోత్సవ సంబరాలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి అధిక సంఖ్యలో తరలివేలుదామని పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ కోసమే తెలంగాణ జర్నలిస్టులు అనే నినాదం పుట్టిన ఓరుగల్లు చైతన్యాన్ని మరోసారి చూపించాల్సిన చారిత్రక అవసరం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా కార్యదర్శి మహమ్మద్ షఫీ, టెంజు జిల్లా అధ్యక్షులు వట్టి కొండ రవి, జిల్లా కార్యవర్గ సభ్యులు తాండ్ర రాజ్ కుమార్, సిరికొండ ప్రసాద్, మాటేటి మధు, ఎస్. రాజేష్, ఇల్లందుల నాగేశ్వరరావు, శేషు, సంతోష్, సురేంద్రబాబు, డానియేల్, రవి, చాంద్, సురేష్, రాజశేఖర్, నందు, విజ్ఞాన్, రాజేష్, వీరన్న తదితరులు పాల్గొన్నారు.