22-05-2025 05:51:39 PM
ఎలక్ట్రికల్ ఏఈ శ్రీనివాస్..
మందమర్రి (విజయక్రాంతి): పట్టణంలో నెలకొన్న విద్యుత్ సమస్యల పరిష్కారానికి కృషిచేసి వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందించేలా చర్యలు చేపడుతున్నట్లు మండల ఎలక్ట్రికల్ ఏఈ శ్రీనివాస్(Mandal Electrical AE Srinivas) స్పష్టం చేశారు. గురువారం పట్టణంలోని 15వ వార్డు శ్రీపతి నగర్ లో కాంగ్రెస్ నాయకులతో కలిసి పర్యటించి ప్రజలను విద్యుత్ సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఇటీవల శ్రీపతినగర్ లో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి(MLA Vivek Venkataswamy) పర్యటించిన సందర్భంగా కాలనీవాసులు విద్యుత్ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడంతో స్పందించిన ఎమ్మెల్యే వెంటనే వార్డుల్లో విద్యుత్ సమస్యలు పరిష్కరించాలని విద్యుత్ అధికారులను ఆదేశించడంతో విద్యుత్ అధికారులు వార్డులో పర్యటించి విద్యుత్ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వార్డు ప్రజలు విద్యుత్ స్థంబాలు ఏర్పాటు చేయాలని, వీది దీపాలు మరమ్మతులు చేపట్టి వెలిగేలా చర్యలు చేపట్టాలని, తరచూ విద్యుత్ కోతలు లేకుండా చూడాలని అధికారులను కోరారు. త్వరలోనే విద్యుత్ సమస్యలను పరిష్కరించేలా కృషి చేస్తానని ఏఇ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ వార్డు బాధ్యులు పైడిమల్ల నర్సింగ్, నాయకులు మంద తిరుమలరెడ్డి, ఎండి జావిద్ ఖాన్, ఎద్దు వెంకటాద్రి, భోగి వెంకటేశ్వర్లు, రామస్వామి, సోమయ్య, సురేందర్, కుండే రామకృష్ణ, శనిగారపు చంద్రయ్యలు పాల్గొన్నారు.