calender_icon.png 28 September, 2025 | 4:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రపంచానికే తలమానికంగా ఫ్యూచర్ సిటీ: డిప్యూటీ సీఎం భట్టి

28-09-2025 02:05:14 PM

హైదరాబాద్:  రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ఖాన్‌పేటలో దాదాపు 30 వేల ఎకరాల్లో నిర్మించే ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ భవనానికి, రావిర్యాల-ఆమన్ గల్ గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్-1కు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం మీర్ఖాన్‌పేటలో ఏర్పాటు చేసిన సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ... మహా అద్భుతంగా మారే నగరంగా ఫ్యూచర్ సిటీ రూపుదిద్దుకోబోతోందని, ప్రపంచం మొత్తం భవిష్యత్తు నగరం వైపు చూస్తోందని భట్టి పేర్కొన్నారు. అలాంటి భవిష్యత్తు నగరం కార్యాలయానికి భూమి పూజ చేసుకున్నామని, 436 ఏళ్ల కింద హైదరాబాద్ నగర నిర్మాణం ప్రారంభమైందని, ఇవాళ హైదరాబాద్ అద్భుతమైన, సుందరమైన నగరంగా మారిందని ఆయన వ్యాఖ్యానించారు. కొత్త సాంకేతికతతో ఫ్యూచర్ సిటీ నిర్మాణం చేయబోతున్నామని, భవిష్యత్తులో ఫ్యూచర్ సిటీ ప్రపంచానికే తలమానికం కాబోతోందని డిప్యూటీ సీఎం తెలిపారు. అద్భుతమైన వైద్య, విద్యాసంస్థలు, పరిశ్రమలు రాబోతున్నాయని, గొప్ప సంకల్పబలంతో ప్యూచర్ సిటీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారని వెల్లడించారు. అందరూ భాగస్వాములై ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి సహకరించాలని డిప్యూటీ సీఎం భట్టి కోరారు.