calender_icon.png 28 September, 2025 | 11:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తిరుమలకు పోటెత్తిన భక్తులు..

28-09-2025 09:57:35 AM

హైదరాబాద్: దసరా శరన్నవరాత్రుల్లో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి భక్తులు పోటేత్తారు. ఆదివారం సెలవు దినం కావడంతో భక్తుల రద్దీ బాగా పెరిగింది. ఇప్పటికే వైకుంఠం క్యూ కాంప్టెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఇక శ్రీవారిని 2 లక్షల మంది వీక్షించేలా టీటీడీ ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. 5 వేల మంది భద్రతా సిబ్బందితో నిఘా, తిరుపతి- తిరుమల మధ్య నిమిషానికో ఆర్టీసీ బస్సు, దాదాపు రెండున్నర లక్షల మంది ప్రయాణించేలా ఏర్పాట్లు చేసినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.