28-09-2025 01:46:34 PM
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ఖాన్‌పేటలో దాదాపు 30 వేల ఎకరాల్లో నిర్మించే ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ భవనానికి, రావిర్యాల-ఆమన్ గల్ గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్-1కు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం మీర్ఖాన్‌పేటలో ఏర్పాటు చేసిన సభలో సీఎం రేవంత్ మాట్లాడుతూ... ప్యూచర్ సిటీపై కొందరు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని, తనకు ఇక్కడ భూములు ఉన్నందువల్లే ప్యూచర్ సీటీ కడుతున్నానని అంటున్నారని సీఎం పేర్కొన్నారు. నా కోసం కాదు.. భవిష్యత్తు తరా కోసం ప్యూచర్ సిటీ నిర్మిస్తున్నామని చెప్పారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి, నారా చంద్రబాబు నాయుడు ముందుతరాల కోసం ఆలోచించారు. అందువల్లే హైటెక్ సిటీ, శంషాబాద్ ఎయిర్ పోర్ట్, ఓఆర్ఆర్ వచ్చాయని, గత పాలకుల నుంచి మంచి ఉంటే నేర్చుకోవాలని వ్యాఖ్యానించారు. ఎన్నాళ్లన్ని ఇంకా విదేశాల గురిచి చెప్పుకుంటాం.. మనం కూడా అలా తయారు కావాలి కాదా.. అని అన్నారు.
నాకు పదేళ్లు సమయం ఇవ్వండి.. న్యూయార్క్ ను మరిపించే నగరం కడతా, 70 ఏళ్ల గడిచిపోయ్యాయి. ఇప్పుడు కూడా మన గురించి ప్రపంచం మన గురించి మాట్టాడుకుే పనులు చేయొద్దా అని ప్రశ్నించారు. రాష్ట్ర అభివృద్ధి పనుల వల్ల కొందరికి ఇబ్బందులు కలగవచ్చు, భారత్ ప్యూచర్ సిటీకి ఏం తక్కువ..? అన్ని అవకాశాలు ఉన్నాయి అని సీఎం మాట్లాడారు. అందుకే ప్యూచర్ సిటీ నుంచి మచిలీపట్నానికి 12 లైన్ల రోడ్డు వేయబోతున్నామని, అలాగే చన్నైకి బుల్లెట్ ట్రైన్ వయా అమరావతికి కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుందన్నారు. ప్యూచర్ సిటీలో 500 ఫార్చ్యూన్ కంపెనీలు కొలువు తీరాలన్నది నా స్వప్నం అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. హైదరాబాద్ లో ప్రస్తుతం 80 ఫార్చ్యూన్ కంపెనీలే ఉన్నాయని, ప్యూచర్ సిటీ విషయంలో చిన్న చిన్న సమస్యలు ఉంటే పరిష్కరించుకుంటామని, చిన్న చిన్న విషయాలకు కోర్టులకు వెళ్లి ఇబ్బంది పడవద్దని సీఎం అభ్యర్థించారు.