calender_icon.png 20 December, 2025 | 6:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాజీ ప్రభుత్వ విప్ ని కలిసిన దోమకొండ నూతన ఉప సర్పంచ్, వార్డు సభ్యులు

20-12-2025 04:51:13 PM

కామారెడ్డి,(విజయక్రాంతి): ఇటీవల జరిగిన స్థానిక సర్పంచ్ ఎన్నికల్లో కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ నూతన ఉప సర్పంచ్ , వార్డు సభ్యులుగా ఎన్నికైన సభ్యులు శనివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో మాజీ ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం నూతనంగా ఎన్నికైన ఉప సర్పంచ్ బొమ్మెర శ్రీనివాసు, వార్డు సభ్యులు గజవాడ శ్రీకాంత్, పాలకుర్తి శేఖర్, బీసు సతీష్ కుమార్, ఐరెని లత రాజేందర్, బొబ్బసాని రమ్య సుధాకర్ ను శాలువాలు కప్పి పుష్ప గుచ్చములతో సన్మానించి అభినందించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలోని పేరుకుపోయిన సమస్యలను పరిష్కరించి  గ్రామ అభివృద్ధికి తోడ్పాటును అందించాలన్నారు . ఇదే స్పూర్తితో రానున్న ఎంపీటీసీ జడ్పిటిసి ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ అన్ని స్థానలలో గెలుచుకునే విధంగా నాయకులు కార్యకర్తలు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బొరెడ్డి కిషన్ రెడ్డి, నాయకులు కాగంటి నాగరాజు, కూర చంద్రం, బొమ్మెర గంగాధర్ ,కొండ శ్రీనివాస్ ,అనుమాల అశోక్ ,చెన్నుగారి నర్సింలు, కుమ్మరి విజయ్, నిమ్మ రాజనర్సు ,బిసుశివ తదితరులు పాల్గొన్నారు