20-12-2025 04:44:52 PM
కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా దోమకొండ మండలంలోని జెడ్పిహెచ్‌ఎస్ బాయ్స్ స్కూల్, జెడ్పిహెచ్‌ఎస్ పలుగడ్డ పాఠశాలల్లో విజన్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో శనివారం “సే నో టు డ్రగ్స్ నషా ముక్త భారత్” అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు విజన్ ఎన్జీవో ప్రాజెక్ట్ మేనేజర్ శరత్ కుమార్ హాజరై, విద్యార్థులకు మాదకద్రవ్యాల వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... డ్రగ్స్‌కు బానిసలవడం వల్ల ఆరోగ్యం, చదువు, భవిష్యత్తు పూర్తిగా నాశనం అవుతుందని తెలిపారు. విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండి, క్రమశిక్షణతో చదువుపై దృష్టి పెట్టాలని సూచించారు. ఈ కార్యక్రమాల్లో జెడ్పిహెచ్‌ఎస్ బాయ్స్ స్కూల్ ప్రధానోపాధ్యాయులు బాపురెడ్డి, జెడ్పిహెచ్‌ఎస్ పలుగడ్డ పాఠశాల ఉపాధ్యాయులు, కోఆర్డినేటర్ రాజు, ఉపాధ్యాయులు పోచయ్య, రాజేందర్‌తో పాటు విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులతో సే నో టు డ్రగ్స్ ప్రతిజ్ఞ చేయించారు.