20-12-2025 05:39:30 PM
ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి
కల్వకుర్తి: అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ ఫలాలు అందించడమే లక్ష్యంగా ప్రజాపాలన కొనసాగుతుందని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు . శనివారం కల్వకుర్తి నియోజకవర్గ కేంద్రంలో రూ.50 లక్షలతో ఐదు పాఠశాలలో చేపడుతున్న అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. అనంతరం పురపాలక పరిధిలో మంజూరైన ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులకు ధ్రువపత్రాలు అందించి మాట్లాడారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు నిర్మించడం జరుగుతుందని అన్ని వర్గాల ప్రజలను దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి కార్యక్రమాలతో ప్రభుత్వం ముందుకు వెళ్తుంది అన్నారు. ఎన్నడూ లేని విధంగా విద్య వైద్యానికి అధిక ప్రాధాన్యత , ఇవ్వడం జరుగుతుందని వెనుకబడిన తరగతుల విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా నిధులు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో పొల్యూషన్ బోర్డ్ సభ్యులు బాలాజీ సింగ్, మున్సిపల్ కమిషనర్ షేక్ మహబూబ్, నాయకులు ఆనంద్ కుమార్, విజయకుమార్ రెడ్డి, రమాకాంత్, శ్రీకాంత్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు