calender_icon.png 20 December, 2025 | 6:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తహసీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించి విద్యార్థులు

20-12-2025 04:54:28 PM

ఎస్ వో మేడం మాకు వద్దంటూ విద్యార్థుల డిమాండ్

వాంకిడి,(విజయక్రాంతి): వాంకిడి కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఎస్ వో తమను తీవ్ర అనుచిత వ్యాఖ్యలతో మానసిక వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తూ విద్యార్థినులు  తరగతులను బహిష్కరించి రోడ్డు ఎక్కారు. తల్లిదండ్రు లతో కలిసి మూకుమ్మడిగా వచ్చి తహసీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించి ధర్నా చేపట్టారు. ఈ ఎస్వో మేడం మాకు వద్దంటే.. వద్దు.. కలెక్టర్ రావాలే మాకు న్యాయం చేయాలే అంటూ విద్యార్థులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఎస్ వో గత కొంతకాలంగా నుంచి తనను..తమ తల్లిదండ్రులను అకారణంగా తీవ్ర పదజాలంతో దూషిస్తోందని, కోడి గుడ్లుసైతం ఇవ్వడం లేదని విద్యార్థులు ఆరోపించారు. మేడమ్ టార్చర్ వల్ల  పాఠాలు చదవలేక పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె పై తాగు చర్యలు తీసుకోవాలని పిల్లల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు.