calender_icon.png 1 January, 2026 | 3:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విజయం ఒక్కరోజులో రాదు

01-01-2026 01:39:02 AM

పిల్లలపై ఒత్తిడి పెంచొద్దు

జాతీయ బ్యాడ్మింటన్ కోచ్ భాస్కర్‌బాబు

హైదరాబాద్, డిసెంబర్ 31 : క్రీడల్లో విజయం ఒక్కరోజులో రాదని జాతీయ బ్యా డ్మింటన్ కోచ్ భాస్కర్‌బాబు అన్నారు. పిల్లలపై తల్లిదండ్రులు ఒత్తిడి తీసుకురావొద్దని, వారిని ప్రోత్సహించాలని కోరారు. సైనా నెహ్వాల్, చేతన్ ఆనంద్ వంటి దిగ్గజ బ్యా డ్మింటన్ క్రీడాకారులను తీర్చిదిద్దిన భాస్కర్‌బాబు తన పుట్టినరోజు సందర్భంగా యువ షట్లర్ల తల్లిదండ్రులకు దిశానిర్థేశం చేశారు.

తన దృష్టిలో కోచింగ్ అంటే కేవలం ఆట నేర్పడం మాత్రమే కాదనీ, క్రీడల ద్వారా జీవితాన్ని ఎలా ఎదుర్కోవాలో నేర్పించడమ న్నారు. క్రమశిక్షణ, సహనం,నిరంతర సాధ న ఉంటేనే ఏ క్రీడాకారుడైనా నిలబడగలడని చెప్పారు. నేటి తరం తల్లిదం డ్రుల్లో సహనం తగ్గుతోందనీ, విజయాలు రాత్రికి రాత్రే రావని వ్యాఖ్యానించారు. తన అకాడమీ ద్వారా గ్రామీణస్థాయిలో ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి వారిని  ప్రోత్సహించడమే లక్ష్యమని భాస్కర్‌బాబు చెప్పారు.