05-01-2025 12:47:22 AM
ముంబై: బీసీసీఐ కొత్త సెక్రట రీగా దేవజిత్ సైకా పేరు దాదాపు ఖ రారైంది. ఇప్పటివరకు ఆ స్థానం లో కొనసాగిన జై షా గతేడాది డిసెంబర్ 1న ఐసీసీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి జై షా స్థానం లో దేవజిత్ తాత్కాలిక సెక్రటరీగా ఉన్నారు. సెక్రటరీ పోస్టుకు దేవజిత్ పేరుతో ఒక్క నామినేషన్ మాత్రమే రావ డం ఆయన ఎన్నిక ఏకగ్రీవం కా నుంది. ఇక బీసీసీఐ కోశాధికారి పోస్టుకు ప్రభ్‌తేజ్ భాటియా నామినేషన్ దాఖలు చేయగా.. ఆయన కూడా ఏకగ్రీవమయ్యే అవకాశాలున్నాయి.