calender_icon.png 30 September, 2025 | 9:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్రీడల్లో నైపుణ్యాలు పెంపొందించుకోవాలి

30-09-2025 12:39:55 AM

డీసీసీ ఉపాధ్యక్షుడు దరూరి యోగానంద చార్యులు 

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి),సెప్టెంబర్29: యువత క్రీడల్లో నైపుణ్యాలను మరింత పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు, హైకోర్టు అడ్వకేట్ దరూరి యోగానందచార్యులు అన్నారు.బతుకమ్మ,దసరా పండుగలను పురస్కరించుకొని సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం గ్రామంలోని జెడ్పీహెచ్‌ఎస్ లో సోమవారం ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థాయి కబడ్డీ పోటీలను ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో (సోమ,మంగళ,బుధవారం)మూడు రోజులపాటు క్రీడలు కొనసాగనున్నట్లు చెప్పారు.క్రీడల్లో గెలుపొందిన విజేతలకు మొదటి బహుమతిగా రూ.30,016ద్వితీయ బహుమతిగా రూ.20,016 తృతీయ బహుమతి రూ.15,016 చతుర్ధ బహుమతిగా రూ.10,016 లను అందజేయనున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు నర్సింగ శ్రీనివాస్ గౌడ్,మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శిగ నసీర్ గౌడ్,ఉపాధ్యక్షులు పెసర సతీష్ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు నర్సింగ కృష్ణమూర్తి,వల్లాల ఖాజా యాదవ్,లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం డైరెక్టర్లు బీరెల్లి శ్రీధర్ రెడ్డి,జేరిపోతుల సోమయ్య,నాయకులు బొర్ర గిరిబాబు,బింగి కృష్ణమూర్తి,వేములకొండ ఉప్పలయ్య,మామిడి అనిల్,పీడీలు,క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.