30-09-2025 12:39:54 AM
హైదరాబాద్, సెప్టెంబర్ 29 (విజయక్రాంతి) : తెలంగాణ విత్తన రంగ అభివృద్ది, ఎగుమతులకు ఉన్న అవకాశాలు అధ్యయనం చేయడానికి జపాన్, -ఇండియా సహ కార ఆర్గనైజేషన్ చైర్మన్ కెంజీ ఒకుమూర, వైస్ చైర్మ్ జూన్ ఓయబు ప్రతినిధుల బృందం తెలంగాణ రాష్ట్రాన్ని సందర్శించా రు. ప్రణాళిక సంఘం ఉపాద్యక్షుడు చిన్నా రెడ్డి అద్యక్షతన తెలంగాణ విత్తన దృవీకరణ సంస్థలో జపాన్ ప్రభుత్వ ప్రతినిధులతో ముఖాముఖీ సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో విత్తన ఎగుమతులు, దిగుమతులపై జపాన్, తెలంగాణ మధ్య పరస్పర సహకారం కోసం చర్చించారు. తెలంగాణలో నాణ్యమైన విత్తనోత్పత్తికి ఉన్న అవకా శాలు, మెరుగైన మౌలిక వసతులు, విత్తన పరిశ్రమ సామర్థ్యం, పరస్పర సహకారానికి ఉన్న అవకాశాల గురించి తెలంగాణ విత్తన దృవీకరణ సంస్థ డైరెక్టర్ డా. కేశవులు వివరించారు. ఈ సందర్భంగా చిన్నారెడ్డి మాట్లా డుతూ తెలంగాణను అంతర్జాతీయ విత్తన హబ్ తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చిత్తశుద్దితో ఉందని స్పష్టం చేశారు.
తెలంగాణ విత్తన రంగాన్ని మరింత అభివృద్ధి పర్చడంలో భాగంగా భవిష్యత్‌లో తెలంగాణ-- జపాన్ మధ్య వివిధ శాలపై పరస్పర సహాకారం ఉండేలా అంగీకారానికి ఆసక్తిగా ఉన్నామన్నారు. సమావేశంలో ‘ జపాన్ నుంచి అధిక దిగుబడిని ఇచ్చే కూరగాయలు, పూల విత్తనాలను దిగుమతి చేసుకొని, పైలెట్ ప్రాజెక్ట్ క్రింద విత్తనోత్పత్తి చేపట్టడం, విత్తనోత్పత్తిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇమేజింగ్ టెక్నాలజీ లాంటి అధునాతన సాంకేతికతల వినియోగం, విత్తన ఆరోగ్యం, విత్తన మొలకెత్తు శక్తి, విత్తన దీర్ఘాయువు, లాంటి అంశా లలో తగిన సాంకేతికతను పొంది తెలంగాణ నుంచి మరిన్ని విత్తన ఎగుమతులను ప్రోత్సహించడం ’ అంశాలపై జపాన్‌తో తెలంగా ణ ప్రభుత్వం అవగాహన అవసరమన్నారు. గ్లోబల్ సీడ్ హబ్ గా తెలంగాణాను తీర్చిడ్డదాటానికి ప్రభుత్వం తీసుకుంటున్న విధాన పరమైన అంశాలను జపాన్ ప్రతినిధి బృందం ప్రశంసించింది.