17-07-2025 11:51:18 PM
‘సినిమా బండి’ ఫేమ్ దర్శకుడు ప్రవీణ్ కాండ్రేగుల తెరకెక్కిస్తున్న మరో చిత్రం ‘పరదా’. ఆనంద మీడియా బ్యానర్‌పై శ్రీనివాసులు పీవీ, శ్రీధర్ మక్కువతో కలిసి విజయ్ డొంకడ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా, దర్శన రాజేంద్రన్, సంగీత, రాగ్ మయూర్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. గురువారం ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్ ‘యత్ర నార్యస్తు’ అనే పాటను కూడా లాంచ్ చేశారు. ఈ సినిమా ఆగస్టు 22న ప్రేక్షకుల ముందుకు రానుంది.
రిలీజ్ డేట్, సాంగ్ లాంచ్ ప్రెస్‌మీట్‌కు హీరో సత్యదేవ్, నిర్మాత సురేశ్‌బాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో హీరో సత్యదేవ్ మాట్లాడుతూ.. “ఈ సినిమా నిర్మాతలతో నేను ఇంతకుముందు ఒక సినిమా చేశాను. చాలా పాషన్ ఉన్న ప్రొడ్యూసర్స్. ఈ సినిమా మీద చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు డైరెక్టర్ ప్రవీణ్. ఈ సినిమా ఆయనకు మరెన్నో అద్భుతమైన అవకాశాల్ని తీసుకొస్తుంది. అనుపమ డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తున్నారు” అన్నారు.
నిర్మాత సురేశ్‌బాబు మాట్లాడుతూ... “ఈ సినిమా ట్రైలర్ చూసి షాక్ అయ్యాను. తర్వాత సినిమా చూశాను. చాలా అద్భుతంగా ఉంది. చాలా ప్యాషన్‌తో చేశారు. టీమ్‌లో ఒక కొత్త రకమైన కథ చెప్పాలనే తపన కనిపించింది. ఇలాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు. ఆగస్టు 22న ఈ సినిమా వస్తుంది. మేము డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం” అని చెప్పారు.
హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ మాట్లాడుతూ... “ఇది చిన్న సినిమా అంటున్నారు.. మేము చెప్పదలుచుకున్న కంటెంట్ చాలా పెద్దది. చాలా ప్రేమతో చేసిన సినిమా ఇది. ఫైనల్‌గా సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్నాం అనేది చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఇది చాలా బోల్డ్ స్టెప్. ఇలాంటి సపోర్ట్ లేకపోతే మేము ఏమి చేయలేం” అన్నారు.
డైరెక్టర్ ప్రవీణ్ కాండ్రేగుల మాట్లాడుతూ... “ఆగస్టు 22 మన మెగాస్టార్ బర్త్‌డే.. అంతకుమించి మంచి డేట్ దొరకదు. సురేశ్‌బాబుకు సినిమాలు అంత ఈజీగా నచ్చవు. కానీ ఈ సినిమా చూసి కంట్లో నీరు పెట్టుకున్నారు. సినిమా బండి, శుభం తర్వాత ఈ సినిమా నాకు చాలా పెద్ద ఫిల్మ్. చాలా హానెస్ట్‌గా ఈ సినిమా చేశాం. చాలా ఇంట్రెస్టింగ్ ఫిలి. మాకిది బాహుబలి లాంటి సినిమా” అన్నారు.
నిర్మాత విజయ్ మాట్లాడుతూ... ‘ఓ బేబీ సినిమాకు వర్క్ చేస్తున్నప్పుడు సురేశ్ ప్రొడక్షన్‌లో ఉన్నానని ఆనందపడ్డా. అప్పుడు సురేశ్‌బాబు దగ్గర డైరెక్ట్‌గా, ఇన్‌డైరెక్టుగా చాలా విషయాలు నేర్చుకున్నా. అనుపమ ఒప్పుకోకపోతే ఈ సినిమా ఉండేది కాదు. డైరెక్టర్ ప్రవీణ్ అద్భుతంగా సినిమా తీశారు. తప్పకుండా అందరికీ నచ్చుతుంది” అని తెలిపారు.
ప్రొడ్యూసర్ శ్రీధర్ మాట్లాడుతూ... “సత్యదేవ్ మాకు చాలా సన్నిహితుడు. మా మధ్య ఉన్న అనుబంధం ప్రత్యేకమైనది. ఇష్టంగా చాలా కష్టపడి చేసిన సినిమా ఇది. మూడేళ్ల ప్రయాణం. అందరూ తప్పకుండా గొప్ప విజయాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నా” అన్నారు.