17-07-2025 11:37:09 PM
విద్యామండలి చైర్మన్‌తో ఎమ్మెల్యే రామారావు పటేల్ భేటీ
హైదరాబాద్,(విజయక్రాంతి): ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ గురువారం తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొ.వి.బాలకిష్టారెడ్డిని మాసాబ్ ట్యాంక్‌లోని కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా తన నియోజకవర్గంలోని ఉన్నత విద్యాసంస్థల్లో అవసరమైన మౌలిక వసతుల ఏర్పాటుకు సంబంధించిన అనేక అంశాలపై చర్చించారు. అలాగే ముధోల్‌ని ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో తగినంత అధ్యాపకులను నియమించాలని కోరుతూ చైర్మన్‌కు ఎమ్మెల్యే వినతిపత్రం సమర్పించారు.