18 April, 2026 | 10:31 PM

Breaking News

దేశ ప్రజల కోసం రాహుల్ గాంధీ పాదయాత్రలు చేస్తుంటే.. దేవుడి పేరుతో బీజేపీ ఓట్ల రాజకీయం   •   మొయినాబాద్‌లో ఆరివ్ అలైవ్ రహదారి భద్రత అవగాహన కార్యక్రమం ముగింపు   •   వేసవి సెలవుల నేస్తం పుస్తకావిష్కరణ   •   బిఆర్ఎస్ మినీ ప్లీనరీని విజయవంతం చేయండి: మాజీ ఎమ్మెల్యే హరిప్రియ   •   గిరిజన గురుకులాలకు భవనాలు లేక కిరాయి ఇండ్లలో నడుస్తున్నాయి   •   స్పెషల్ డ్రైవ్ ద్వారా భూ సమస్యలు పరిష్కరించాలి   •   మహిళా బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ తీరును నిరసిస్తూ..   •   గడువు పెంపు   •   పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి.... దోమల నివారణను అరికట్టండి   •   శుశ్రుత హాస్పిటల్‌లో అగ్ని ప్రమాదాలపై అవగాహన   •  

ప్రజల ఆశలు, ఆకాంక్షలకనుగుణంగా అభివృద్ధి జరుగుతోంది

16-05-2025 12:00 AM
  1. నిధుల మంజూరులో రాష్ట్ర మంత్రులు సంపూర్ణంగా సహకరిస్తున్నారు

పనుల్లో నాణ్యత లోపిస్తే అధికారులదే బాధ్యత

కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు

పాల్వంచ మున్సిపాలిటీలో రూ.3.20కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

భద్రాద్రి కొత్తగూడెం/పాల్వంచ మే 15 (విజయ క్రాంతి) ః  పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించకుంటే అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని కొత్తగూడెం ఎమ్మెల్యే సాంబశివరావు హెచ్చరించారు. గురువారం మున్సిపాలిటీ పరిధిలో సుమారు రూ 3.20 కోట్ల నిధులతో వివిధ అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూప్రజల ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా ని యోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నామన్నారు. పాల్వంచ ము న్సిపాలిటీ పరిధిలోని కరకవాగు, వెంగళరావు నగర్ కాలనీ రాహుల్ గాంధీనగర్ హమాలి కాలనీ వనమా కాలనీ వికలాంగుల కాలనీ వెంకటేశ్వర హిల్స్ కాలనీ కాంట్రాక్టర్స్ కాలనీ మా ర్కెట్ ఏరియా టీచర్స్ కాలనీ బొడ్డుగూడెం పాత పాల్వంచ ప్రాంతాలలో సిసి రోడ్లు, సిసి డ్రైన్లకు శంకుస్థాపన చేశారు.

కొత్తగూడెం నియోజకవర్గాన్ని అన్ని రకాల అభివృద్ధి పరచడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రులు సంపూర్ణ సహకారం అందిస్తున్నారని, వారి సహకారంతోనే నియోజకవర్గాన్ని కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి పరచడానికి ప్రతి చిన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాట్లు తెలిపారు.

మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి ప నులు నాణ్యతగా, పదికాలాలపాటు నిలిచివుండేలా చూడాలని, అందుకు అధికారులు నిత్యం పర్యవేక్షించాలని, నిర్మా ణాల్లో లోపాలు జరిగితే ఉపేక్షించేదిలేదని హెచ్చరించారు. .

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సుజాత, సీపీఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా డీసీఎంఎస్ మాజీ చైర్మన్ కొ త్వాల శ్రీనివాసరావు, సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు ముత్యాల విశ్వనాథం పట్టణ కార్యదర్శి అడుసుమిల్లి సాయిబాబా, మండల కార్యదర్శి వీసంశెట్టి పూర్ణచంద్రరావు పట్టణ సహాయ కార్యదర్శి ఉప్పుశెట్టి రాహుల్ జిల్లా సమితి సభ్యులు బండి నాగేశ్వరరావు, సీపీఐ, కాంగ్రెస్ నాయకులు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.