19 April, 2026 | 12:07 AM

కట్టుబాట్లు అంతరించిపోకుండా చేయటం హర్షదాయకం

16-05-2025 12:00 AM

ఐటీడీఏ పీఓ రాహుల్ 

భద్రాద్రికొత్తగూడెం/ములకలపల్లి, మే 15 (విజయక్రాంతి) ః గిరిజనుల ఆచార వ్యవహారాలు, సంస్కృతి సాంప్రదాయాలు, కట్టుబాట్లు అంతరించిపోకుండా గిరిజన పెద్దలు, యువతి యు వకులు, కుటుంబ సభ్యులతో కలిసి నేటికీ పాతతరం సాంప్రదాయాల ప్రకారం పండుగ వాతా వరణంలా భూమి పూజ చేసుకోవడం సంతోషకరమని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ అన్నారు. గురువారం ములకలపల్లి మండలం తిమ్మంపేట గ్రామపంచాయతీలోని రాజీవ్ నగర్ గ్రామంలో గిరిజనులు జరుపుకుంటున్న భూమి పండుగలో ఆయన పాల్గొన్నారు.

భూమి పం డుగకు ఆ గ్రామానికి వచ్చిన ప్రాజెక్టు అధికారిని గిరిజనులు అందరూ కలిసి ఆదివాసి సాం ప్రదాయ ప్రకారము ఘనంగా స్వాగతం పలికారు. పండుగలో భాగంగా గిరిజన పెద్దలు యు వకులతో కలిసి విలంబులతో కోడిగుడ్డును పూజించి, దానిని వారి దేవుడు ఎదురుగా పెట్టి బా ణాలతో పగలగొటడం ఆనవాయితీ. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాతతరం గిరిజన పెద్దలు ఆచార వ్యవహారాలు కట్టుబాట్లు మర్చిపోకుండా ఏ కార్యం తలపెట్టిన ముందుగా గిరి జనుల సాంప్రదాయ ప్రకారం వారి దేవతలను పూజించి పనులు ప్రారంభిస్తారని అన్నారు.

అ లాగే దుక్కి దున్నే ముందు భూమి పూజలు చేసి విత్తనాలను దేవుని ముందు ఉంచి పూజలు చేసి వాటిని పొలాలలో చల్లితే పంటలు బాగా పండుతాయి అని విశ్వసం. కుటుంబ సభ్యులు అందరూ పూజించిన విత్తనాలను పంచుకొని పొలాల్లో చల్లుకోవడం వారి ఐక్యమత్యానికి ని దర్శమాన్నారు.

మారుమూల గ్రామమైన గుండాలపాడును జేసీ శర్మ ఐటీడీఏ ప్రాజెక్ట్ అధి కారిగా పనిచేసిన సమయంలో ఆ గ్రామాన్ని మొట్టమొదటిసారి సందర్శించి గ్రామంలో నెలకొ న్న సమస్యలను పరిష్కరించారని, 35 సంవత్సరాల తర్వాత మా గ్రామాన్ని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ సందర్శించి గ్రామంలోని సమస్యలను గ్రామస్తులను అడిగి తెలుసు కోవడంతో గమనార్హం. ఆ గ్రామంలో నెలకొన్న సమస్యలను పిఓ దృష్టికి తీసుకువచ్చారు.

మా రుమూల గ్రామమైన మా గ్రామానికి సరైన రోడ్డు సౌకర్యం లేదని, పంటలు పండించు కోవడానికి కరెంటు బోరు మోటర్లు అవసరం ఉన్నదని, గ్రామంలోని గిరిజన రైతులకు పోడుప ట్టాలు కూడా సరిగా అందడం లేదని గిరిజనులు పీవో దృష్టికి తీసుకొచ్చారు., వాటిని తప్పనిస రిగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.  ఈ కార్యక్రమంలో గిరిజన మ్యూజియం ఇంచార్జ్ వీరా స్వామి మరియు గ్రామంలోని కుల పెద్దలు యువతి యువకులు తదితరులు పాల్గొన్నారు.