18న భూపతి చంద్ర స్మారక కథానికల పోటీ -2025
16-05-2025 12:00 AM
ముషీరాబాద్, మే 15 (విజయ క్రాంతి) : భూపతి చంద్ర స్మారక కథానికల పోటి-2025 పురస్కారాల ప్రదానోత్సవ సభ ఈ నెల 18న తెలంగాణ సారస్వత పరిషత్తులోని దేవులపల్లి రామానుజరావు కళామందిరం లో భూపతి చంద్ర మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు ’భూపతి చంద్ర’ స్మారక కథనికల పోటి-25 అధ్యక్షులు ఎమ్. ఎల్. కాంతారావు తెలిపారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కె.రామచంద్రమూర్తి , ఆత్మీయ అతిథిగా బి.నరసింగరావు(సినీ ద ర్శకుడు, సంస్కృతి ప్రతినిధి), గౌరవ అతిథిగా, ప్రొ.మన్నవ సత్యనారాయణపాల్గొం టారని సభా నిర్వహణ సి.ఎస్. రాంబాబు నిర్వహిస్తారని తెలిపారు.






