calender_icon.png 10 February, 2026 | 3:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభివృద్ధి పథకాలే గెలిపిస్తాయి

10-02-2026 01:56:00 AM

  1. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ ఖాయం
  2. ఎన్నికల ప్రచారంతో మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి

హుజూర్‌నగర్/కోదాడ/తుంగతుర్తి, ఫిబ్రవరి 9: రాష్ట్రంలో జరిగే మున్సిపల్ ఎన్నిక ల్లో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేయడం ఖాయమని ఇరిగేషన్, సివిల్‌సప్లై శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధీమావ్యక్తం చేశారు. సోమవారం సూర్యాపేట జిల్లాలోని హుజూర్‌నగర్, నేరేడుచర్ల, కోదాడ, తిరుమలగిరి  ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. సంక్షేమ అభివృద్ధి పథకాలే మున్సి పల్ ఎన్నికల్లో అన్ని స్థానాలను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు.

బీఆర్‌ఎస్ చేసిన అప్పులు ఉన్నప్పటికీ, ప్రస్తుతం విద్య వైద్యానికి పెద్దపీట వేస్తూ, వేలకోట్లలతో అభివృద్ధి పనులు చేస్తూ ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్, బీజేపీలకు ఓటేస్తే మోదీకి వేసినట్లే అన్నారు. గత ప్రభుత్వాలతో పోలిస్తే ప్రస్తుతం రాష్ట్రం లో రైతులు భారతదేశంలోనే అత్యధిక పంట పండించినట్లు తెలిపారు. సూర్యాపేట జిల్లా లో ఉన్న హుజూర్‌నగర్, నేరేడుచర్ల, కోదా డ, సూర్యాపేట, తిరుమలగిరి మున్సిపాలిటీల అభివృద్ధికి ప్రత్యేకనిధులు కేటాయిసా మన్నారు.

తిరుమలగిరి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా మూల అశోక్‌రెడ్డి నియమిస్తున్నట్లు ప్రకటించారు. కార్యక్రమంలో ఎమ్మె ల్యేలు ఉత్తమ్ పద్మావతిరెడ్డి, మందుల సా మేలు, భువనగిరి ఎంపీ కిరణ్ కుమార్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్‌రావు, డీసీసీబీ మాజీచైర్మన్ ముత్తవరపు పాండురంగా రావు, సత్యనారాయణ, జనార్ధన్, రైతుకమిషన్ సభ్యులు వెంకన్నయాదవ్, డీసీసీ అధ్య క్షులు నరసయ్య, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు అనురాధ పాల్గొన్నారు.