20-12-2025 12:27:35 AM
కమిషనర్ ప్రపుల్ దేశాయి
కరీంనగర్ క్రైం, డిసెంబరు 19 (విజయ క్రాంతి): నగరపాలక సంస్థ పరిదిలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేసేలా చర్యలు తీస్కోవాలని ఇంజనీరింగ్ అధికారులను కమిషనర్ ప్రఫూల్ దేశాయ్ ఆదేశించారు. శుక్రవారం కమిషనర్ నగరంలో సుడిగాలి పర్యటన చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ... అమరవీరుల స్థూపం సమీపంలో గల మంచి నీటి పైపులైన్ మరమ్మతు పనులను త్వరగా అరికట్టాలన్నారు. గత 30 సంవత్సరాల క్రీతం వేసిన మంచి నీటి పైపులైన్ కాబట్టి తరుచుగా లీకేజీలు సంభవిస్తే శాశ్వత పరిష్కారానికి తగిన చర్యలు తీస్కోవాలని అధికారులను ఆదేశించారు. జనవరి 1 లోగా ఐడీఎస్‌ఎంటీ భవన్ అధునీకరణ పనులను పూర్తి చేసేలా చర్యలు తీస్కోవాలని అధికారులను ఆదేశించారు.
మానేరు డ్యాం నుండి వచ్చే సీఫేజీ వాటర్ కు కచ్చనాల ద్వారా నీటిని మల్లించేలా ఇరిగేషన్ ఇంజనీరింగ్ అధికారులను కోరారు. వాకింగ్ ట్రాక్ లో స్టోన్ డస్ట్ వేసేందుకు ప్రణాళికలు సిద్దం చేయాలన్నారు. వాకింగ్ ట్రాక్ ఇరువైపులా ఇటీవల నాటిన పండ్ల మొక్కలను సంరక్షించాలని ఆదేశిం చారు. స్థానికంగా ఉన్న ఓపెన్ జిమ్ము చెడిపోయిన పరికరాలను త్వరగా రిపేర్ చెసి, వాకర్స్ కు సౌకర్యం కల్పించాలని ఆదేశించారు. సప్తగిరి కాలనీలో అర్బన్ హెల్త్ సెంటర్ కోసం స్థల పరిశీలన చేసి... హెల్త్ సెంటర్ భవనం నిర్మాణం పనులను ప్రారంభించేలా చర్యలు తీస్కోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఈ రాజ్ కుమార్, ఈఈ సంజీవ్ కుమార్, డీఈ వెంకటేశ్వర్లు, ఏఈలు, తదితరులు పాల్గొన్నారు.