30-10-2025 12:50:36 AM
అధికారులతో ఎమ్మెల్యే జీఎంఆర్ సమీక్షా సమావేశం
పటాన్ చెరు, అక్టోబర్ 29 :పటాన్ చెరు నియోజకవర్గ పరిధిలో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని, నిర్దేశించిన గడువులోగా పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని పటాన్ చెరు ఎ మ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అధికారుల ను ఆదేశించారు. బుధవారం పటాన్ చెరు డివిజన్ పరిధిలోని క్యాంపు కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో పలు అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
పటాన్ చె రు డివిజన్ పరిధిలోని సాకి చెరువు, బండ్లగూడ పరిధిలోని దోషం చెరువులలోకి ము రుగనీరు చేరకుండా చేపడుతున్న ప్రత్యేక పై ప్ లైన్ పనుల పురోగతిపై చర్చించారు. క్షేత్రస్థాయిలో పైపులైన్ నిర్మాణ పనులు నెమ్మది గా కొనసాగుతున్నాయని త్వరితగతిన పూర్తిచేసేలా సంబంధిత కాంట్రాక్ట్ ఏజెన్సీలను ఆ దేశించాలని జిహెచ్‌ఎంసి ఇరిగేషన్ విభాగం ఈఈ మల్లేష్ ను ఆదేశించారు.
పటాన్ చెరు సాకి చెరువు, రామచంద్రాపురం రాయసముద్రం చెరువుల సుందరీకరణ పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు. తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని పోచారం రెవిన్యూ ప రిధిలో పాలిటెక్నిక్ కళాశాల, యంగ్ ఇండి యా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ భవనాలకు త్వరలోనే భూమి కేటాయిస్తూ ప్రభు త్వం ఉత్తర్వులు జారీ చేయబోతుందని తెలిపారు. భవనాల నిర్మాణాలకు సైతం నిధులు కొరత లేకుండా చూస్తున్నామని తెలిపారు.
మంచినీటి పంపిణీ అంశంలో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని మిషన్ భగీరథ ఎస్‌ఈ రఘువీర్ ను ఆదేశించారు. పరిశ్రమలకు మంచినీరు అందించడం ఎం త ముఖ్యమో, ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత ఉందన్నారు. డి సెంబర్ నెల నుండి సింగూర్ డ్యాం మరమ్మత్తులు చేపడుతున్న సందర్భంగా సంవత్సరం పాటు మంచినీటి పంపిణీ ఆపివేయడం జరుగుతుందని సంబంధిత అధికారులు ఎ మ్మెల్యే జిఎంఆర్ దృష్టికి తీసుకెళ్లారు.
సిం గూరు ద్వారా పంపిణీ జరుగుతున్న గ్రామా లు, పట్టణాలు, డివిజన్ల పరిధిలో మంచినీటి ఇబ్బందులు తలెత్తకుండా కాలేశ్వరం ప్రాజె క్టు ద్వారా అందించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. త్వరలోనే సంబంధిత ఉన్నత అధికారులు, ప్రజా ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చే యనున్నట్లు తెలిపారు.
అభివృద్ధి పనుల్లో అలసత్వం వహించవద్దని నిర్దేశించిన గడువులోగా పనులు పూర్తిచేసి ప్రజలకు అందు బాటు లోకి తీసుకురావాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అమీన్ పూర్ మాజీ జడ్పిటిసి సుధాకర్ రెడ్డి, అమీన్పూర్ మాజీ ఎంపీ పీ దేవానందం,
పటాన్ చెరు ఎమ్మార్వో రంగారావు, పటాన్ చెరు ఎంపీడీవో యాదగిరి, గుమ్మడిదల ఎంపీడీవో ఉమాదేవి, తె ల్లాపూర్ మున్సిపల్ కమిషనర్ అజయ్ రెడ్డి, మిషన్ భగీరథ ఈఈ విజయ లక్ష్మి, డీఈలు హరీష్, శ్రీనివాస్, ఏఈ మౌనిక, గ్రామపంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.