01-11-2025 11:57:04 AM
రాజన్న సిరిసిల్ల,(విజయక్రాంతి): జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్(Congress Party candidate Naveen Yadav) గెలుపు కోసం వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆదేశాల మేరకు జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎర్ర గడ్డ బంజారా నగర్, ఆనంద్ నగర్ లో గడపగడపకు తిరుగుతూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అవుతున్న సందర్భంలో అనేక సంక్షేమ పథకాలు పేద ప్రజలకు అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కిందని వారు అన్నారు.
పేద బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని వారన్నారు. ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు కట్టించినటువంటి ఘనత రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి దక్కుతుందని అందుకు జూబ్లీహిల్స్ ఓటర్ మహాశయులందరూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ చేతి గుర్తుపైన ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను వేడుకోవడం జరిగింది. రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేసిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దక్కిందని వారన్నారు... గత పది ఏళ్లలో టిఆర్ఎస్ పాలలో ఏ ఒక్కరు కూడా ఉద్యోగాలు కల్పించలేదని కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీ అని గుర్తు చేశారు... కాంగ్రెస్ పార్టీతోనే పేద బడుగు వర్గాలకు న్యాయం జరుగుతుందని న్యాయం చేస్తుందని నమ్మకం ప్రజల్లో ఉందని అందుకోసమే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని వారు అన్నారు.
రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అండగా ఉంటారని వారన్నారు.. విద్యావంతుడు చదువుకున్న వ్యక్తి నవీన్ యాదవ్ గెలిపించుకుంటేనే జూబ్లీహిల్స్ అభివృద్ధి జరుగుతుందని వారన్నారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గం వెనుకబాటుకు గురి కావడం జరిగిందని మళ్లీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ నవీన్ యాదవ్ గెలిచిన తర్వాత జూబ్లీహిల్స్ నియోజకవర్గం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లడం జరుగుతుంది కాబట్టి అందరూ చేతి గుర్తుపై ఓటు వేసి నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా అందరినీ చేతులు జోడించి వేడుకుంటున్నామని వారు అన్నారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కనికరం రాకేష్, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కూరగాయల కొమరయ్య, మాజీ ఎంపిటిసి హైమద్ పషా, బీసీ సెల్ నియోజకవర్గం ఇంచార్జ్ అంబాటి చంద్రశేఖర్ యాదవ్, మైనార్టీ పట్టణ అధ్యక్షులు అక్రమ్, అక్కనపెల్లి నరేష్ తదితరులు పాల్గొన్నారు....