01-11-2025 11:50:03 AM
హైదరాబాద్: ఎర్రగడ్డ డివిజన్ రెహమత్ నగర్(Rehmatnagar division)లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Union Minister Kishan Reddy) శనివారం పాదయాత్ర చేపట్టారు. జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డితో(BJP candidate for Jubilee Hills Lankala Deepak Reddy) కలిసి కిషన్ రెడ్డి ఓట్లు అభ్యర్థించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీజేపీని గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. నిన్న జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని బోరబండ డివిజన్ పర్యటించిన కిషన్ రెడ్డి ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, గత బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవినీతి, మోసాలను వివరించినట్లు కిషన్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక(Jubilee Hills by-election) దగ్గరపడుతున్న కొద్ది ప్రధాన పార్టీల నేతలు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. నిన్న జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా వెంగళరావు నగర్ పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ను గెలిపించాలని కోరారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలకు ముందు షేక్ పేట్ మండలంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు రోడ్ షో నిర్వహించారు. మాగంటి సునీతకు ఓటు వేసి గెలిపించాలని కేటీఆర్ ఓటర్లను కోరారు.