01-11-2025 11:53:40 AM
నంగునూరు: మొంథా తుఫాన్ కారణంగా పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని,ఎకరానికి రూ.25 వేలు నష్టపరిహారం చెల్లించాలని మాజీ ఎంపీపీ జాప శ్రీకాంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.మండల పరిధిలోని మగ్ధూంపూర్ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన ఆయన తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు.తుఫాను ప్రభావం ధాన్యం నేల పాలయిందని,వేలాది ఎకరాల్లో వరి,పత్తి, కందులు, మొక్క జొన్న వంటి పంటలు దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.నష్టం తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తేమ శాతం నిబంధనల పేరుతో ఆలస్యం చేయకుండా తక్షణమే ధాన్యం కొనుగోలు ప్రక్రియను ప్రారంభించాలని ఆయన కోరారు.రైతులు ఎవరూ అధైర్య పడొద్దని బీఆర్‌ఎస్ పార్టీ అండగా ఉంటుందన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రాగుల సారయ్య, మాజీ సర్పంచ్ మయోజు చక్రపాణి, నాయకులు అచ్చిన మల్లయ్య, బండారి రాములు, బండారి మల్లేశం, బర్మ రాజుతో పాటు మార్కెట్ సిబ్బంది, హమాలీలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.