calender_icon.png 1 November, 2025 | 1:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మానవత్వం చాటుకున్న వెంపటి గ్రామ యువకులు

01-11-2025 10:19:48 AM

తుంగతుర్తి,(విజయక్రాంతి): మృతుడు వారితో కలిసి చదువుకోలేదు.. కనీసం వారికి పరిచయం కూడా లేడు.. అయినా కూడా అతను మృతి చెందడంతో అనాధలుగా మిగిలిన అతని బిడ్డలకు అండగా నిలిచి తమ మానవత్వాన్ని చాటుకున్నారు. మండల పరిధిలోని వెంపటి గ్రామానికి చెందిన బొజ్జ మహేష్ తీవ్ర అనారోగ్యం పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి  చెందాడు. గతంలో అతని భార్య కూడా అనారోగ్యంతో మృతి చెందింది.నిరుపేద కుటుంబానికి చెందిన వారికి “రెక్కాడితే గాని డొక్కాడని” దీనస్థితిలో ఉన్న కుటుంబం వారిది. దానికి తోడు ఇద్దరు చిన్నారులు. తల్లిదండ్రులు మృతి చెందడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆ బిడ్డల దీనగాధను యువతకు విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేసి ప్రతి ఒక్కరూ ఆర్థిక సహాయాన్ని అందజేయాలని విజ్ఞప్తి చేశారు.

వెంటనే మానవత్వంతో స్పందించిన గ్రామ యువత అందరూ ఏకతాటి గా, ఐక్యమత్యం తో  రూ.20000 వేలు అందించడంతోపాటు 2006- 7 పదవ తరగతి బ్యాచ్ యువకులు రూ .10000 వేల నగదు పోగు చేయగా కాలనీవాసులు క్వింట సన్న బియ్యం జమ చేసి శనివారం యువకులు, పెద్దలు కలిసి మృతుడి కుమారుడు కూతురు కు మొత్తం రూ.30000 వేల రూపాయల ఆర్థిక సహా శనివారం మృతుడి పిల్లలకు అందజేశారు. ఆర్థిక సహాయం అందజేసి ఆదుకున్నందుకు మృతుడి తల్లిదండ్రులు కన్నీరు, మున్నీరై యువకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఏ ఆపద వచ్చినా వెంటనే స్పందించి సహాయ సహకారాలు అందిస్తున్నందుకు  గ్రామ యువతకు, పెద్దలకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఆర్థిక సహాయం అందజేసిన వారిలో కూరపాటి సోమేష్, కొండగట్టుకుల పరుశురాం, పుల్లూరు వెంకన్న, గుండ గాని శ్రీను, వెలమ మోహన్, నోముల మధుకర్, అబ్బ గాని మహేష్, కొండగడుపుల నాగయ్య, తప్పెట్ల ఎల్లయ్య,కొండగడుపుల వీరస్వామి, కొండగడుపుల ముత్తయ్య, రామచంద్రు, నాగయ్య, రాజయ్య,సుధాకర్,రాపాక అభినవ్, పుల్లూరు యాకమల్లు, తదితరులు ఉన్నారు.