calender_icon.png 2 November, 2025 | 4:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లోకల్ బాడీ ఎన్నికల్లో సత్తా చాటాలి

30-10-2025 12:50:11 AM

 మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి 

చేవెళ్ల, అక్టోబర్ 29:  లోకల్ బాడీ ఎన్నికల్లో సత్తా చాటాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రా రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం ఆమె సమక్షంలో డీసీఎంఎస్ చైర్మన్ పట్లోళ్ల కృష్ణారెడ్డి , పార్టీ మండల అధ్యక్షుడు ప్రభాకర్, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ గోనె కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో చేవెళ్ల మండలం రావులపల్లికి చెందిన ముడిమ్యాల పీఏసీఎస్ డైరెక్టర్ కేసారం నరేందర్, మాజీ ఉప సర్పంచ్ పట్లోళ్ల ప్రకాష్ రెడ్డి, కె. మధు, లక్ష్మన్ కుమార్, బూర్ల మల్లేష్ తో పాటు 50 మంది  నాయకులు బీఆర్ ఎస్ పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా సబితా రెడ్డి మాట్లాడుతూ.. సీఎం  రేవంత్ రెడ్డి రిజర్వేషన్స్ పేరిట బీసీలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఎప్పడు ఎన్నికలు వచ్చినా సిద్ధంగా ఉండాలని, ఆ మేరకు గ్రౌండ్ వర్క్ చేయాలని సూచించారు. చేవెళ్లలో చాలా బాగా పనిచేస్తున్నారని, ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ స్థానాలు గెలుచుకోవాలని పిలుపునిచ్చారు. 

ఈ కార్యక్రమం లో బీఆర్ నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు వంగ శ్రీధర్ రెడ్డి , ముడిమ్యాల మాజీ సర్పంచ్, బీఆర్ ఎస్ చేవెళ్ల జెడ్పీటీసీ అభ్యర్థి శేరి స్వర్ణలత దర్శన్,  ఉద్యమకారుడు శేరి రాజు, పీఏసీ ఎస్ డైరెక్టర్ మాధవరెడ్డి, సీనియర్ నేతలు మాజీ ఉప సర్పంచులు శేరి శ్రీనివాస్, గోనె మాధవ్ రెడ్డి, నాయకులు బ్యాగరి శివ కుమార్, బి. శ్రీనివాస్, మధుసూదన్ గౌడ్, కె. రాము ఉన్నారు.