19-09-2025 11:10:45 PM
చిట్యాల,(విజయక్రాంతి): చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామానికి చెందిన వ్యక్తి ఆర్థిక సమస్యలతో బలవన్మరణానికి పాల్పడినట్లు ఎస్సై ఎం.రవికుమార్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం... పెద్దబోయిన రాజు(42) గత కొద్దిరోజులుగా తన భార్య స్వగ్రామమైన పెద్దకాపర్తిలో నివాసం ఉంటున్నాడు. తాగుడుకు బానిసై పనిచేయకుండా బాధ్యతారహితంగా ఉండడంతో అప్పులు ఎక్కువై తీర్చలేని పరిస్థితిలో జీవితం మీద విరక్తి చెంది తాను అద్దెకు కుంటున్న ఇంట్లో ఎవరు లేని సమయంలో చీరతో ఫ్యాన్ కు ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుని భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.