19-09-2025 10:47:10 PM
మహబూబాబాద్,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండల కేంద్రానికి చెందిన ఆవుల వెంకన్న కు చెందిన గొర్రె శుక్రవారం ఉదయం 8 కాళ్లు, ఒక తల, రెండు మోండాలతో వింత గొర్రె పిల్లకు జన్మనిచ్చినట్లు పశు వైద్యాధికారి రవీందర్ తెలిపారు. పిండం ఏర్పడే క్రమంలో జన్యుపరమైన లోపాల వల్ల ఇలా జరుగుతుందని ఆయన చెప్పారు. పుట్టిన గంట వ్యవధిలోనే అది చనిపోయిందని రైతు తెలిపారు.