19-09-2025 11:13:23 PM
కోహెడ,(విజయక్రాంతి): కోహెడ మండలం తంగళ్లపల్లి గ్రామానికి చెందిన వేణుగోపాల దేవస్థాన పల్లకి సేవకుడు, పశువుల కాపరిగా 30 సంవత్సరాల నుండి నిస్వార్ధ సేవ చేసిన జెట్టి చంద్రయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు నిరుపేద కుటుంబానికి చెందిన జెట్టి చంద్రయ్య మరణించడంతో గ్రామ యువకులు, గ్రామస్థులు ఏక తాటి పైకి వచ్చి తమ వంతు సహకారంగా ఎవరికీ తోచినంత వారు డబ్బులను బియ్యన్ని విరాళంగా ఇవ్వడం జరిగింది. విరాళలకు సంబంధించిన రూపాయలు 30,000 లను శుక్రవారం నాడు మృతుని కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగింది.