calender_icon.png 20 September, 2025 | 1:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హెల్త్ క్యాంప్ నిర్వహించిన వైద్యాధికారి జువేరియా

19-09-2025 11:21:07 PM

నాగల్ గిద్ద,(విజయక్రాంతి): నాగల్ గిద్ద మండలం కారస్ గుత్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ జువేరియ ఆధ్వర్యంలో రేఖ నాయక్ తండ గ్రామపంచాయతీ పరిధిలోని చోక్ల నాయక్ తండలో వైరల్ ఫీవర్, దగ్గు, జరం వస్తున్న విషయం తెలుసుకొని వెంటనే తాండలో క్యాంపు నిర్వహించారు పాఠశాల విద్యార్థులు, తాండవాసులు దాదాపు 40 మందికి వైద్య పరీక్షలు చేసి మందులు పంపిణీ చేయడం జరిగిందని వైద్యాధికారి జువేరియా  తెలిపారు. విష జ్వరాలు ఉన్నందున త్రాగునీరు వేడి చేసి చల్లార్చి  తాగాలని వారు తెలిపారు. జ్వరాలు వచ్చిన వెంటనే తమకు ఆస్పత్రికి రావాలని ప్రజలకు తెలిపారు.