calender_icon.png 20 September, 2025 | 12:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్రిస్టియన్ మైనారిటీ కమిషన్ చైర్మన్ దీపక్ జాన్ ను సన్మానించిన ఖానాపూర్ పాస్టర్లు

19-09-2025 11:07:18 PM

కమ్యూనిటీ హాల్, సమాధుల స్థలం, చర్చి నిర్మాణాలకు వినతులు

ఖానాపూర్,(విజయక్రాంతి): క్రిస్టియన్ మైనార్టీ కమిషన్ చైర్మన్ దీపక్ జాన్ ను శుక్రవారం కడం, ఖానాపూర్, పెంబి ,దస్తురాబాద్, పాస్టర్లు సన్మానించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన జిల్లా స్థాయి పాస్టర్ల సమావేశంలో స్థానిక పాస్టర్లు ఆయనను సన్మానించినట్లు ఆ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు, ప్రశాంత్ కుమార్, రాజబాబులు తెలిపారు. ఈ సందర్భంగా చైర్మన్ జిల్లా కలెక్టర్లకు వినతి చేస్తూ, క్రైస్తవ సమస్యలపై స్పందించాలని వారికి కావలసిన స్మశాన స్థలాలు, కమ్యూనిటీ హాల్, చర్చి నిర్మాణాలకు, అనుమతులు ఇచ్చి సహాయం చేయాలని వారు చైర్మన్, కలెక్టర్లను, కోరినట్లు తెలిపారు.

అందుకు చైర్మన్ ,కలెక్టర్ లు సానుకూలంగా స్పందించినట్లు వారు తెలిపారు. స్థానిక తహసీల్దారులకు ఆదేశాలు ఇచ్చి సమస్యలు పరిగణలోకి తీసుకోవాలని ఆదేశాలు ఇస్తున్నట్లు వారు తెలిపినట్లు తెలిపారు.ఈ సందర్భంగా జిల్లా కమిటీ ఏకగ్రీవ ఎంపిక జరిగినట్లు తెలిపారు. నిర్మల్ జిల్లా పాస్టర్ల కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు వారు తెలిపారు. గౌరవ అధ్యక్షులుగా పాస్టర్ జాన్సన్, అధ్యక్షులుగా పాస్టర్ రాజ్ కుమార్, ఉపాధ్యక్షులుగా పాస్టర్ సొలోమోన్ రాజ్, ప్రధాన కార్యదర్శిగా పాస్టర్ ప్రశాంత్, జాయింట్ సెక్రెటరీ పాస్టర్ శామ్ రాజ్, ట్రెజరర్ గా పాస్టర్ సంతోష్, ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా పాస్టర్ నాగాజి ,పాస్టర్ సంజీవ్ ,పాస్టర్ డేవిడ్, పాస్టర్ రాజబాబు, పాస్టర్ రవి ,పాస్టర్ బిఎస్ తిమోతి, లు ఎంపికైనట్లు వారు తెలిపారు.