19-09-2025 10:55:48 PM
మున్సిపల్ కమీషనర్ విజయ్ కుమార్
లక్షేట్టిపేట,(విజయక్రాంతి): ప్రభుత్వ వసతి గృహ విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని మున్సిపల్ కమీషనర్ విజయ్ కుమార్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని ఎస్సీ బాలుర హాస్టల్ ను ఉదయం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రభుత్వం వసతి గృహ విద్యార్థుల సంక్షేమం కోసం ఎన్నో నిధులు కేటాయిస్తుందన్నారు. నాణ్యమైన భోజనం విద్యార్థులకు అందించాలని వసతి గృహ సంక్షేమాధికారికి సూచించారు. విద్యార్థుల ఆరోగ్యం, చదువు పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. అంతేకాకుండ పరిసరాల పరిశుభ్రతను పాటించాలన్నారు. అనంతరం హాస్టల్ కిచెన్, పరిసరాలను పరిశీలించి పలు సూచనలు చేశారు.