19-09-2025 10:51:27 PM
కొత్తపల్లి,(విజయక్రాంతి): నగరంలోని పారమిత హెరిటేజ్ పాఠశాలలో శుక్రవారం ముందస్తు బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థినులు సంప్రదాయక దుస్తులు ధరించి, సృజనాత్మక నైపుణ్యంతో వివిధ రకాల పూలతో పోటా పోటీగా బతుకమ్మలను పేర్చి అలంకరించారు. విద్యార్థుల తల్లులకు బతుకమ్మలను పేర్చే విధానం, బతుకమ్మ పాటల పోటీలను నిర్వహించి బహుమతులను అందజేశారు. అనంతరం వివిధ తరగతుల విద్యార్థినులు వారి తల్లులు మరియు ఉపాధ్యాయినులు, కోలటాలతో, నృత్యాలతో పాటలతో అలరించారు. పారమిత విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ ఇ ప్రసాద రావు విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, పాఠశాల తల్లిదండ్రులకు ముందస్తు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.