10-02-2025 01:11:32 AM
వేములవాడ, ఫిబ్రవరి 9: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం. భక్తులతో కిటకిటలాడింది. ఆదివారం సెలవు రోజు కావడంతో వివిధ ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకునేందుకు తరలివచ్చారు.
మొదట భక్తులు ధర్మగుండంలో స్నానాలు ఆచరించి కళ్యాణ కట్టలు తలనీలాలు సమర్పించి క్యూలైన్ ల ద్వారా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కోడే మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారిని దాదాపు 40 వేల మంది భక్తులు దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు అంచనా వేశారు.