calender_icon.png 23 November, 2025 | 11:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీ బంగారు మైసమ్మతల్లి దేవాలయ నిర్మాణానికి రూ.1.50 లక్షల విరాళం అందజేత

10-02-2025 01:11:01 AM

రాజాపూర్, ఫిబ్రవరి 9 : జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని కావేరమ్మ పేట (డాక్) ఐబి బంగ్లా సమీపంలో 44వ జాతీయ రహదారి పక్కన భక్తులు కోరిన కోర్కెలు తీర్చే కల్పవ ల్లి శ్రీ బంగారు మైసమ్మ తల్లి దేవా లయ నిర్మాణానికి, అభివృద్ధి నిమిత్తం బీఆర్‌ఎస్ పార్టీ యువనేత దొండ్లపల్లి మాజీ ఎంపీటీసీ చించోడ్ అభిమన్యు రెడ్డి. రూ.1.50 లక్షల విలువ గల చెక్కును విరాళంగా అందజేశారు.

24వ వార్డు కౌన్సిలర్ కోట్ల ప్రశాంత్ రెడ్డి, 2వ వార్డు కౌన్సిలర్ బుక్క మహేష్, నాయకులు కృష్ణా రెడ్డి, లింగం, మహేష్ గౌడ్ లు ఆదివారం దేవాలయాన్ని సంద్శించి బంగారు మైసమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి రూ.1.50 లక్షల విలువ గల చెక్కును దేవాలయ కమిటీ సభ్యులకు అందజేశారు.

ఈ సందర్భంగా కోట్ల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ బిఆర్‌ఎస్ యువనేత అభిమన్యు రెడ్డి  దేవాలయాల, బడుల నిర్మాణానికి ఆర్థిక సహాయం అందజేయడంలో ముందుంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ సభ్యులు గోనెల నరేందర్, గుండు చంద్రశేఖర్, మిద్దె నాగరాజు, జయ శ్రీవాత్సవ్ తదితరులు ఉన్నారు.