calender_icon.png 19 May, 2025 | 3:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పుష్కరాలకు పోటెత్తిన భక్తులు

19-05-2025 01:23:32 AM

  1. ఓంకారంతో మార్మోగుతున్న ముక్తేశ్వర ఆలయం

పుష్పగిరి పీఠాధిపతి సభినవోద్దండ విద్యాశంకర పుణ్యస్నానం

సరస్వతీ మాతకు సినీ నటుడు రాజేంద్రప్రసాద్ పూజలు

మంథని, మే 18 (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాలేశ్వరంలో జరుగుతున్న సరస్వతీ పుష్కరాలకు భక్తులు పోటెత్తుతున్నారు. కాళేశ్వరం ముక్తేశ్వరుడి దర్శనానికి ఆదివారం భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. పుష్పగిరి పీఠాధిపతి సభినవోద్దండ విద్యాశంకర భారతీ మహస్వామి పుష్కర స్నానం ఆచరించి, కాళేశ్వర ముక్తీశ్వర స్వామివారిని దర్శించుకున్నారు.

భక్తులకు ఆశీర్వచనం అందచేశారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ ఆర్జేసి రామ కృష్ణారావు, ఈవో మహేష్, ఆలయ చైర్మన్ మోహన్‌శర్మ పాల్గొన్నారు. కాగా త్రిలింగ క్షేత్రం, త్రివేణి సంగమ తీరానికి భక్తుల రద్దీ కొనసాగు తోంది. సరస్వతీ పుష్కరాల్లో 4వ రోజు ఆదివారం ఉదయం నుంచే లక్షలాది మంది భక్తులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారు.

దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు కాళేశ్వరం చేరుకున్నారు. శనివారం ట్రాఫిక్ జామ్ కావడంతో ఎదురైన ఇబ్బందులు పునరావృతం కాకుండా కలెక్టర్ రాహుల్‌శర్మ ఆదేశాల మేరకు అధి కారులు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టారు. కాళేశ్వరంలో భక్తుల రద్దీ కొనసా గుతున్న నేపథ్యంలో కలెక్టర్ రాహుల్‌శర్మ హెలికాప్టర్ ద్వారా ఏరియ ల్ సర్వే నిర్వహించారు. 

సైకత లింగాలకు పూజలు

సరస్వతీ అంతర్వాహిని నది పుష్కరాలను పురస్కరించుకని భక్తులు త్రివే ణి సంగమ తీరాన పుణ్య స్నానాలు ఆచరించారు. అనంతరం గంగ మ్మ ఒడిలో జంగమయ్యను ఆరాధించారు. సైకత లిం గాలను తయారు చేసుకున్న భక్తులు శివ నామస్మర ణలో చేస్తూ భక్తిని చాటుకుం టున్నారు. నది తీరంలో పవిత్ర స్నా నాలు ఆచరించిన తరువాత నదీ తీరంలోనే సైకత లింగాలను తయారు చేసి శివుడిని ప్రత్యేకంగా పూజించే ఆనవాయితీని పాటిస్తారు.

అనం తరం త్రివేణి సంగమాన్ని పూజించి దీపారాధన చేసి గంగమ్మకు మొక్కు లు తీర్చుకుంటున్నారు. ఆ తర్వాత సరస్వతీ ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన 17 అడుగుల ఏకశిల సరస్వతి మాతను, కాళేశ్వర, ముక్తీశ్వర స్వామిని, శుభానంద దేవిని, సరస్వతి మాతను దర్శించుకుంటున్నారు. పుష్కరుడు సంచరించే వేళ ముత్తయిదలు మొంటెల వాయినం మొక్కులు తీర్చుకుంటున్నారు. 

త్రివేణి సంగమంలో స్నానం.. నా అదృష్టం: రాజేంద్రప్రసాద్ 

మూడు నదులు కలిసే కాళేశ్వరం త్రివేణి సంగమంలో పుణ్య స్నానం చేయడం తన పూర్వజన్మ సుకృతమని సినీ నటుడు రాజేంద్రప్రసాద్ అన్నారు. ఆదివారం ఆయ న కాళేశ్వరంలో పుణ్య స్నానం ఆచరించారు. సరస్వతీ మాతకు పూజలు చేసి, ముక్తేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ.. రాష్ట్రంలోనే కా కుండా దేశంలో ఇతర రాష్ట్రాల నుం చి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని సరస్వతీ పుష్కర స్నానం చేసి పుణీతులు కావాలని ఆయన కోరారు. పుష్కరాల ఏర్పాట్లను తెలంగాణ ప్ర భుత్వం ఎంతో చక్కగా నిర్వహిస్తున్నదని, భక్తులకు ఇబ్బందులు లేకుం డా అన్ని ఏర్పాట్లు చేశారని చెప్పారు.