19-05-2025 01:25:43 AM
కూతురు పీజీ వైద్య విద్య కోసం ఆర్థిక సాయం
హైదరాబాద్, మే 18 (విజయక్రాంతి): తెలంగాణ ఉద్యమ అమరుడు పోలీసు కిష్ట య్య కుటుంబానికి బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. కేసీఆర్‌ను ఎర్రవెల్లిలోని ఆయన వ్యవసాయ క్షేత్రంలో కిష్టయ్య కుటుంబ సభ్యులు ఆదివారం మర్యాపూర్వకంగా కలిశారు. కిష్టయ్య కుమార్తె ప్రియాంక విద్యాభ్యాసానికి కేసీఆర్ ఆర్థిక సాయాన్ని అందిస్తున్నారు.
వైద్య విద్యలో ఆసక్తి కనబర్చిన ప్రియాంకను కేసీఆర్ ఎంబీబీఎస్ చదివించారు. వైద్య విద్యను పూర్తి చేసి పీజీ చేస్తున్న ప్రియాంక చదువుకు కావాల్సిన ఆర్థిక సాయాన్ని కేసీఆర్ వారికి అందజేశారు.
కిష్టయ్య కుమారుడు రాహుల్ వివాహం నిశ్చయమైన విషయం తెలుసుకు న్న కేసీఆర్ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. కిష్టయ్య కుటుంబానికి తన సంపూర్ణ సహాకారం ఎప్పటికీ కొనసాగుతూనే ఉం టుం దన్న భరోసా ఇచ్చారని ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.