పరమత సహనం కలిగి ఉండాలి
07-04-2025 12:00 AM
కల్లూరు,ఏప్రిల్6 :- పరమత సహనం కలిగి వుంటూ క్రైస్తవులు ఐక్యతతో ముందుకు సాగాలని అసోసియేషన్ ఇండిపెండెంట్ క్రిస్టియన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు రెవరెండ్ పి ఎనోష్ కుమార్ అన్నారు. ఆదివారం పట్టణంలోని టిజిఎం వర్షిప్ సెంటర్ లో రన్ ఫర్ జీసస్ వాల్ పోస్టర్ ని రాష్ట్ర అధ్యక్షులు ఎనోష్ కుమార్, ప్రేయర్ సెల్ జిల్లా అధ్యక్షులు టి నిర్మల్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి దర్నాసి బాలరాజు తో కలసి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సర్వ మానవాళి పాపమును పరిహరించడానికి ప్రభువైన యేసుక్రీస్తు కల్వరి శి లువలో మరణించి తిరిగి లేచుట ద్వారా శుభప్రదమైన నిరీక్షణ మానవాళికి అనుగ్రహించబడిందని అన్నారు.






