calender_icon.png 10 September, 2025 | 6:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘మావోయిస్టు’ కేంద్ర కమిటీ కార్యదర్శిగా దేవూజీ

10-09-2025 12:48:52 AM

-స్వస్థలం జగిత్యాల జిల్లా కోరుట్ల

-నంబాల కేశవరావు స్థానాన్ని భర్తీ చేసిన పార్టీ

-ప్రస్తుతం మిలీషియ సభ్యుడిగా ఉన్న తిప్పిరి తిరుపతి అలియాస్ దేవూజీ

-గ్రీన్ హంట్ సమయంలో బెంగాల్‌లో లాల్‌గఢ్ ఉద్యమానికి నాయకత్వం

-2010లో దంతెవాడలో సీఆర్‌ఎఫ్ జవాన్లపై దాడికి సారథ్యం

-తిరుపతి తలపై రూ.కోటి రివార్డు

కోరుట్ల రూరల్, సెప్టెంబర్ 9 (విజయక్రాం తి): మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ  కార్యదర్శిగా జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన తిప్పిరి తిరుపతి అలియాస్ దేవుజీ నియామితులయ్యారు. నంబాల కేశవరావు ఎన్‌కౌంటర్‌తో ఖాళీయైన స్థానాన్ని తిప్పిరి తిరుపతితో మావోయిస్టు పార్టీ భర్తీ చేసింది. పార్టీలో కేజీ సత్య మూర్తి, కొండపల్లి సీతారామయ్య, గణపతి, నంబాల తర్వాత మరోసారి తెలుగు వాడైన తిరుపతికి కీలకమైన మావోయిస్టు పార్టీ కేంద్ర కార్యదర్శి బాధ్యతలు చేపట్టడం గమనార్హం.

మావోయిస్టు పార్టీలో తిరుపతితో పాటు మరో తెలుగువాడైన మల్లోజుల వేణుగోపాలరావు పార్టీ పొలిటికల్ బ్యూరో చీఫ్‌గా పనిచే స్తున్నట్లు సమాచారం. కాగా ప్రస్తుతం పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడిగా, మిలిషియా ఇన్‌చార్జిగా ఉన్న తిరుపతి గ్రీన్ హంట్ సమయంలో బెంగాల్‌లో లాల్ గఢ్ ఉద్యమానికి నాయక త్వం వహించారు.

మావోయిస్టు పార్టీలో సెకం డ్ క్యాడర్‌లో ఉన్న తిరుపతి పార్టీ దాడులకు వ్యూహకర్తగా వ్యవహరిస్తున్నారు. తిరుపతి మెరుపు దాడులు జరిపి తప్పించుకోవడంలో దిట్టగా పేరుంది. చంద్రబాబుపై అలిపిరి దాడి లో నంబాల కేశవరావుతో పాటు తిరుపతి కూడా ఉన్నాడని అప్పట్లో ప్రచారం జరిగింది. 2010లో దంతెవాడలో 74మంది సీఆర్‌ఎఫ్ జవాన్లను చంపిన దాడికి తిరుపతి సారథ్యం వహించాడని పోలీసు వర్గాల కథనం. 

తిరుపతి ఉద్యమ ప్రస్థానం..

జగిత్యాల జిల్లా కోరుట్ల అంబేద్కర్ నగర్‌కు చెందిన తిరుపతి 1983లో ఇంటర్ చదువు తూ.. రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ పట్టణ అధ్యక్షుడిగా కొనసాగుతున్న సమయంలో పోలీసు నిర్బంధాన్ని తట్టుకోలేక అడవి బాట పట్టారు. దళ సభ్యుడి నుంచి పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యుడిగా, మిలీషియా డాడుల వ్యూ హకర్తగా ఎదిగాడు.

అనంతరం ఛత్తీస్‌గఢ్ కమిటీ సభ్యురాలు, ఆదివాసి సృజనను పెండ్లి చేసుకున్నారు. అనంతరం ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో సృజన మృతి చెందగా.. తిరుపతిపై రూ.కోటి రూపాయల రివార్డును కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆపరేషన కగార్ నేపథ్యంలో తిరుపతి ప్రస్తు తం  మావోయిస్టు కారిడార్ ఉద్యమానికి నాయకత్వం వహిస్తూ, మావోయిస్టు పార్టీ బలోపేతానికి రిక్రూట్మెంట్‌కు కృషి చేస్తున్నట్టు తెలిసింది.