10-09-2025 12:55:22 AM
ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి
అబ్దుల్లాపూర్‌మెట్, సెప్టెంబర్ 9: ముఖ్యమంత్రి సహాయ నిధి పేదల పాలిట వరంలాంటిదని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి అన్నారు. మంగళవారం పెద్ద అంబర్ పేట్ మున్సిపల్ పరిధిలోని ఆయా గ్రామాలకు చెందిన లబ్దిదారులకు తొర్రూర్ క్యాంఫ్ ఆఫీసులో రూ. 9. 27 లక్షల చెక్కుల పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ...
సీఎం రిలీఫ్ ఫండ్ పేద ప్రజలకు వరంలాంటిదన్నారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పేదలకు అప్పుడు అండగా ఉంటుందని పేర్కొన్నారు. గత పాలకులు సీఎం సహాయ నిధిని కూడా దుర్వినియోగం చేశారని విమర్శించారు.
ఈ కార్యక్రమంలో గడ్డిఅన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ భాస్కరాచారి, మండల పార్టీ అధ్యక్షులు కొత్త ప్రభాకర్ గౌడ్, సీనియర్ నాయకులు కందాల రంగారెడ్డి, మాజీ సర్పంచ్‌లు శ్రీనివాస్ రెడ్డి, శ్రీనివాస్, కిషన్, కే వెంకట్ రెడ్డి, ధన్‌పాల్‌రెడ్డి, మూల కిరణ్, అంతటి ధనరాజ్, రాజు నాయక్ తదితరులున్నారు.