calender_icon.png 10 September, 2025 | 6:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాళోజీ జీవితం స్ఫూర్తిదాయకం

10-09-2025 12:47:23 AM

వరంగల్, సెప్టెంబర్ 9, (విజయక్రాంతి): ప్రముఖ కవి, పద్మ విభూషణ్ కాళోజీ నారాయణరావు  జీవితం, రచనలు స్ఫూర్తిదాయక మని అధికారులు పేర్కొన్నారు. తెలంగాణ భాషా సాహిత్యానికి ఆయన విశేష కృషిచేశారని గుర్తు చేశారు. కాళోజీ నారాయణరావు జయంతిని మంగళవారం వరంగల్ జిల్లా కేం ద్రంలో ఘనంగా నిర్వహించారు.

హనుమకొండ కాళోజీ జంక్షన్‌లోని  కాళోజీ  విగ్రహా నికి కలెక్టర్ స్నేహ శబరీష్, హనుమకొండ ఆర్డీఓ రాథోడ్ రమేష్ పూలమాలలు వేసి నివాళులఅర్పించారు. అదేవిధంగా హనుమకొండ జిల్లా కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాలులో ఆయన చిత్రపటానికి జిల్లా రెవెన్యూ అధికారి వై.వి. గణేష్, జిల్లా ఖజానా శాఖ అధికారి శ్రీనివాస్ కుమార్ పూలమాల వేశారు.