23-07-2025 12:37:11 AM
కామారెడ్డి, జూలై 22 (విజయక్రాంతి): కామారెడ్డి పట్టణంలో ఇటీవల అమెరికా నాసా అంతర్జాతీయ స్థాయిలో ఎన్ ఎస్ ఎస్ సెటిల్మెంట్ కాంటెస్ట్ 2025 లో స్థానిక శ్రీ చైతన్య విద్యార్థులు విజయ ప్రభంజనం సృష్టించారు. ఈ సందర్భంగా పాఠశాలకు ముఖ్య అతిథిగా కోఆర్డినేటర్ మహిపాల్ రెడ్డి విచ్చేసి విద్యార్థులను అభినందించారు. వారి చేతుల మీదుగా మెమొంటోను అందించారు.
ప్రపంచ వ్యాప్తంగా 25 దేశాల విద్యార్థులు పాల్గొన్నారు. దానిలో భారత్ కు మొత్తం బహుమతులు లభించగా అందులో 30 వరకు శ్రీ చైతన్య విద్యార్థులు కైవసం చేసుకున్నారు. జాతీయ స్థాయిలో కామారెడ్డి శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థులు చేసిన ప్రాజెక్టుకు మూడవ బహుమతి లభించినందుకు పాఠశాల ప్రిన్సిపల్ సంపత్ కుమార్ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
వారికి నాసా సర్టిఫికెట్ మెమొంటోలను అందిస్తూ దీనికి సహకరించిన తల్లిదండ్రులను యాజమాన్యాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సంపత్ కుమార్,డి రాకేష్,సి బ్యాచ్ ఇంచార్జ్ స్వామి,నాసా ఇన్చార్జ్ మధు,నవీన్ మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.