calender_icon.png 3 November, 2025 | 3:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ధీశాలి ప్రొఫెసర్ సాయిబాబా

03-11-2025 02:40:30 AM

  1. మంచి సమాజం రావాలని జీవితమంతా పోరాడిన వ్యక్తి సాయిబాబా
  2. ప్రొఫెసర్ హరగోపాల్
  3. జీవితమంతా పోరాడిన గొప్ప వ్యక్తి
  4. సీనియర్ సంపాదకులు కే. రామచంద్రమూర్తి
  5. క్యాపిటలిజంతో ప్రజాస్వామ్యం బలహీన పడుతుంది
  6. ప్రముఖ కవి, రచయిత్రి మీనా కంద స్వామి

ముషీరాబాద్, నవంబర్ 2 (విజయక్రాంతి): తాను నమ్మిన విశ్వాసం కోసం ప్రొఫెసర్ సాయిబాబా తన జీవితాన్ని ధారపోశారని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్‌లో ప్రొఫెసర్ సాయిబాబా స్మారకోపన్యాసంలో భాగంగా ‘అసమ్మతి గళాలు-సాహిత్యం, ప్రజాస్వామ్య వరివర్తనలు రచయితల పాత్ర‘ అనే అంశంపై చర్చా కార్యక్రమం ప్రొఫెసర్ హరగోపాల్ అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్య అతిథులుగా కవి, రచయిత్రి మీనాకంద స్వామి, పూర్వ సంపాదకులు రామచం ద్రమూర్తి, ఆర్ధిక వేత్త డి.నరసింహారెడ్డి హాజరై మాట్లాడారు.

ముందుగా హరగోపాల్ అధ్యక్షోపన్యాసం చేస్తూ మానవీయ, మంచి సమాజం రావాలని తన జీవితకాలమంతా సాయిబాబా పోరాడారని, ఈ విషయంపై సమాజంలో చర్చ జరగాల్సి వున్నదని పేర్కొన్నారు. పదేళ్ల పాటు జైలులో ఉన్నా ప్రొఫె సర్ సాయిబాబా అధైర్య పడలేదన్నారు. ఉపా చట్టం కింద సాయిబాబాను జీవిత శిక్ష వేసి జైలులో ఉంచిన న్యాయస్థానమే అంతిమంగా నిర్దోషి అని తేల్చిందన్నారు. కానీ, పదేళ్ల జైలు జీవితంలో ఆయన కోల్పోయిన ఆరోగ్యాన్ని ఎవరూ బాధ్యులు అని సమా జం అడగాల్సి ఉండేదన్నారు. జైలు నుంచి బయటకొచ్చాక సమాజానికి చాలా సేవ చేయాల్సిన దశలో సాయిబాబా మన మధ్య లేకపోవడం విషాదకరమన్నారు.

రామచంద్రమూర్తి మాట్లాడుతూ సాయిబాబా తన జీవితమమంతా పోరాడిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. 90 శాతం వైకల్యం ఉన్న వ్యక్తితో ఏ ప్రమాదం లేదంటే, ఆయన మెదడే చాలా ప్రమాదకరమని ఓ జడ్జి దారుణంగా మాట్లాడారని అన్నారు. అమిత్ షా వచ్చే ఏడాది మార్చికల్లా మావోయిజం అంతం చేస్తాం చేస్తామని ప్రకటించారని, సమాజంలో అసమానతలు రూపు మాపకుండా, సమస్యలు వరిష్కరించకుండా మావోయిజం అంతం చేయలేరని అన్నారు.

డి.నరసింహారెడ్డి మాట్లాడుతూ ఇలాంటి సమావేశాలు యువతకు స్ఫూర్తిగా నిలుస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. మీనాకంద స్వామి మాట్లాడుతూ క్యాపిటలిజంతో ప్రజాస్వామ్యం బలహీన పడుతుందన్నారు. ప్రధాని మోదీ పేదల అవసరాలను మరిచి, దేశ సంపదనంతా అదానీ, అంబానీలకు దోచి పెడుతున్నారని విమర్శించారు. ఈ సమావేశంలో సాయిబాబా మెమోరియల్ కమిటీ సభ్యులు రాందేవ్, సాయిబాబా కూతురు మంజీర, కాత్యాయని విద్మే హే తదితరులు పాల్గొన్నారు.