calender_icon.png 22 January, 2026 | 12:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డయల్ 100 సిబ్బంది బాధ్యతతో మెలగాలి

29-08-2024 12:00:00 AM

మెదక్ ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి

మెదక్, ఆగస్టు 28(విజయక్రాంతి): ఆపద సమయంలో బాధితులకు మెరుగైన సేవలు అందించడానికి డయల్ 100 సిబ్బంది బాధ్యతగా మెలగాలని మెదక్ ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి సూచించారు. బుధవారం ఆయన జిల్లా సాయుధ దళ డీఎస్పీ రంగనాయక్, ఆర్‌ఐ శైలేందర్‌తో కలిసి జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పెట్రోలింగ్ వాహనాల పనితీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. డయల్ 100కు వచ్చిన ఫిర్యాదులపై సత్వరమే స్పందించాలన్నారు. ఆయనవెంట అదనపు ఎస్పీ మహేందర్, ఆర్‌ఎస్సై మహిపాల్ ఉన్నారు.