30-09-2025 12:00:00 AM
బైంసా, సెప్టెంబర్ 29 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా బాసర సరస్వతి దేవి ఆలయంలో సోమవారం శరన్నవరాత్రి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మూలా నక్షత్ర వేడుకలు పుసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మూలా నక్షత్ర వేడుకలకు ఈసారి జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ దంపతులు ప్రత్యేకంగా హాజరై పూజలు నిర్వహించారు అదేవిధంగా బోధ్ ఎమ్మెల్యే జాదవ్ అనిల్‌తో పాటు స్థానిక నాయకులు ఈ వేడుకలకు హాజరయ్యారు పిల్లలకు పెద్ద ఎత్తున అక్షరాభ్యాసాలను చేయించుకున్నారు. అయితే ఈసారి బాసరలో మూల నక్షత్రం వేడుకలకు భారీ ఏర్పాట్లు చేసినప్పటికీ ఆశించిన స్థాయిలో భక్తులు రాలేదని స్థానికులు తెలిపారు.