16-12-2025 12:56:29 AM
బస్టాండ్ ఎదుట కుటుంబ సభ్యుల ఆందోళన
పాల్వంచ, డిసెంబర్ 15,(విజయక్రాంతి):భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణ పరిధిలోని వెంగళరావు కాలనీకి చెందిన ధారావత్ హరినాథ్ (40) మృతి అనస్పదంగా ఉందనీ, భా ర్య భర్తను హత్య చేసి ఆత్మహత్యగా సృష్టిస్తున్నట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ సోమవారం పాల్వంచ బస్టాండ్ ఎదుట ఆందోళన ఒకటి గారు. వెంగళరావు కాలనీ కి చెందిన ధారవత్ హరినాథ్ గత రాత్రి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు భార్య తెలపడంతో, మృతదేహం పై గాయాలు ఉండటంతో మృతుడి తల్లి, బంధువులు మృతి పై అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
భార్య శృతిలయ భర్తను చంపి ఉరివేసిందని, ఆమెను అరెస్టు చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలంటూ పాల్వంచ- భద్రాచలం జాతీయ రహదారిపై మృతదేహంతో ధర్నా నిర్వహించారు. దీంతోభారీగా వాహనాలు నిలిచిపోయి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పట్టణ0పోలీసులు రంగ ప్రవేశం చేసి బంధువులకు సర్ది చెప్పేందుకు ప్రయత్నించిన వినకపోవడంతో కొంత ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది.
మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ నిర్వహిస్తామని ఎస్‌ఐ సుమన్ హామీ ఇవ్వడంతో ధర్నా విరమించి మృతదేహాన్ని ఇంటికి తరలించారు. మృతుడి భార్య శృతి లయ ములుగు జిల్లా వాజేడు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తుంది. వారిద్దరిది ప్రేమ వివాహమనే, ఇద్దరూ కుమారులు ఉన్నట్లు బంధువులు తెలియజేశారు.