calender_icon.png 16 December, 2025 | 9:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నమ్మిన వారికి పట్టం కట్టేది కాంగ్రెస్సే: పొదెం వీరయ్య

16-12-2025 12:57:46 AM

  1. ఘనంగా నూతన సర్పంచుల సన్మానం

ఎంపీటీసీ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని పిలుపు

అశ్వాపురం, డిసెంబర్ 15 (విజయక్రాంతి):కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న వారికి ఎన్నటికీ అన్యాయం జరగదని, పార్టీ కోసం కష్టపడే వారిని గుర్తించి సముచిత స్థానం కల్పించే ఏకైక పార్టీ కాంగ్రెస్ అని మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర అటవీశాఖ అభివృద్ధి సంస్థ ఛైర్మన్ పొదెం వీరయ్య స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అశ్వాపురం మండలం మల్లెలమడుగు, సీతారామపురం పంచాయతీల నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున గెలుపొందిన నూతన సర్పంచులు మచ్చ నరసింహారావు, సబ్కా పిచ్చయ్యలు సోమవారం భద్రాచలంలోని పొదెం వీరయ్య నివాసంలో ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిశారు.

మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఓరుగంటి బిక్షమ య్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పొదెం వీరయ్య నూతన సర్పంచులను శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో చూపిన విజయ పరంపరను రానున్న ఎంపీటీసీ ఎన్నికల్లోనూ కొనసాగించాలని పిలుపునిచ్చారు. కార్యకర్తలు,నాయకులు సమన్వయంతో పనిచేసి ఎక్కువ స్థానాలను కైవసం చేసుకోవా లని దిశానిర్దేశం చేశారు.

విజయం సాధించిన అభ్యర్థులను, కృషి చేసిన మండల పార్టీ నాయకత్వాన్ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తూము పెద్ద రాఘవులు, ఆవుల రవి, బేతం రామకృష్ణ, బచ్చు వెంకటరమణ, మానాది వెంకన్న, మా నాది సైదులు, పద్దం నరసింహారావు, గొడ్ల నాగేశ్వరరావు, కుంజ భాస్కర్, వేముల వెంకటేష్, వంగూరి మధు, వార్డు సభ్యులు కోరం శ్రీను తదితరులు పాల్గొన్నారు.