calender_icon.png 17 December, 2025 | 1:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్నికల పోలింగ్.. పటిష్ట బందోబస్తు

16-12-2025 05:20:53 PM

బైంసా (విజయక్రాంతి): బైంసా డివిజన్లో బుధవారం నిర్వహించే గ్రామ పంచాయతీ ఎన్నికలకు పోలీస్ పరంగా భద్రత చర్యలు తీసుకున్నట్లు జిల్లా ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. బైంసా ముధోల్ తానూర్ కుబీర్ బాసర మండలాల్లో 124 పోలింగ్ కేంద్రాల్లో బుధవారం ఎన్నికల పోలింగ్ నిర్వహిస్తామని పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు అవుతుందని తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయని ఎన్నికలను ప్రశాంతంగా ప్రజాస్వామ్య పద్ధతిలో నిర్వహించినందుకు పార్టీల అభ్యర్థులు సహకరించాలని కోరారు. ఎన్నికల్లో గొడవలు చేసిన, ప్రలోభాలకు గురిచేసిన చర్యలు తీసుకుంటామన్నారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేయవద్దని తెలిపారు. ఎక్కడైనా ఇబ్బందిగా ఉంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ అవినాష్ కుమార్, పోలీసులు పాల్గొన్నారు.